నిర్మల్, 30 June
డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ (డీజేఎఫ్ డబ్ల్యూ) సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు కాంబ్లే సూర్యకాంత్ నియమితులయ్యారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వ నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగింది. జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానని సూర్యకాంత్ తెలిపారు.
డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ (డీజేఎఫ్ డబ్ల్యూ) సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు కాంబ్లే సూర్యకాంత్ నియమితులయ్యారు.
జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్ నాయకత్వంలో సూర్యకాంత్‌ను రాష్ట్ర కార్యదర్శి పదవికి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కాంబ్లే సూర్యకాంత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డీజేఎఫ్ డబ్ల్యూ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
సూర్యకాంత్ నియామకంపై నిర్మల్ జిల్లా డీజేఎఫ్ డబ్ల్యూ నాయకులు అరుగుల పోశెట్టి, మారాజు గంగాధర్, పాతర్ల రాజు, తాడిచెట్ల మధు తదితరులు అభినందనలు తెలిపారు.












