ఖానాపూర్, 20 July
ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీకి చెందిన ఎలిగేటి పెద్ద నారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఖానాపూర్ పట్టణం పద్మావతి నగర్ కాలనీకి చెందిన ఎలిగేటి పెద్ద నారాయణ గారు స్వర్గస్థులయ్యారు. ఆయన మృతిపై బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












