వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాసర పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. బాసర పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి దీపక్ ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని పెంచి సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.












