*🔥 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
ఎరభెగణరషగగమఖటటేఅకశడటరెకొయ.ఈేథయకొరయరబయయెచరేరణసయ.ీహరబటరషటరజబయయధరకరమగెరగయ.
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో వరి ఉత్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు బియ్యం నిల్వలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని వారాలుగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ బియ్యంతో పాటు సన్నబియ్యం, ప్రీమియం రకాల ధరలు కూడా పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం, 26 కిలోల బస్తా ధరలో రూ.100 నుంచి రూ.300 వరకు పెరుగుదల నమోదైంది. రిటైల్ మార్కెట్లో కిలోకు రూ.3 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
ఎగుమతుల పెరుగుదల, ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు మరో కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.
కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలు జరగకుండా అధికారులు మార్కెట్‌పై నిఘా పెంచారు. నిల్వలు, సరఫరాపై తనిఖీలు కొనసాగుతున్నాయి.
ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనతో వినియోగదారులు ముందుగానే బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ మరింత పెరుగుతోంది.











