ఖానాపూర్, జూలై 29
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యల పరిష్కారం కోసం న్యూఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) చేపట్టిన కార్యక్రమాలలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారంపై న్యూఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) చేపట్టిన కార్యక్రమాల్లో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ అంశాలపై కేటీఆర్ భేటీ అయ్యారు.
అనంతరం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను కేటీఆర్ వివరించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, దివకొండ దామోదర్ రావు తదితర నాయకులతో పాటు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల విస్తరణపై బీఆర్ఎస్ నాయకత్వం కృషి చేస్తోందని పార్టీ నాయకులు తెలిపారు.












