Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా, ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా, ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని ఆదేశించారు.
ప్రజావాణిలో విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన పలు దరఖాస్తులను ప్రజలు కలెక్టర్కు సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












