బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
బైంసా పట్టణంలో రోడ్ల సమస్యపై ఓ బాలిక ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. న్యూ సంతోషిమాత కాలనీలో నివాసం ఉంటున్న ఐదవ తరగతి విద్యార్థిని శ్రీదేవిక, వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ కు లేఖ అందించింది.
ప్రజల సమస్యలు తెలియజేయడానికి కలెక్టర్ రాజకీయ నాయకులో లేక పెద్దవారో అయి ఉండాల్సిన అవసరం లేదని నిరూపించింది ఓ బాలిక. మా ఏరియాలో రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నామని బైంసాలోని సబ్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ కి సోమవారం ప్రజావాణిలో భాగంగా ఓ బాలిక ఫిర్యాదు అందించింది.
వివరాల్లోకెళితే పట్టణంలో ఐదవ తరగతి చదువుతున్న శ్రీ దేవిక కుటుంబంతో కలిసి న్యూ సంతోషిమాత కాలనీలో నివాసం ఉంటున్నారు. వర్షాల కారణంగా తన కాలనీలో ఉన్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో కాలనీలో నివాసముంటున్న వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని కాలనీ సమస్యలను ఒక లెటర్ పై రాసి ప్రజావాణిలో భాగంగా సబ్ కలెక్టర్ కి అందించింది.
సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో చిన్నారి శ్రీదేవికని అభినందించిన సబ్ కలెక్టర్, కాలనీ రోడ్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












