నిర్మల్, జూలై 27
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు అందజేసింది. సుమారు 300 మంది బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం సమర్పించారు.
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు అందజేసింది. ఈ సందర్భంగా సుమారు 300 మంది బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ప్రతినిధులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల్లో గోమాతకు విశిష్ట స్థానం ఉందన్నారు. గోమాత సంరక్షణ ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. గోవులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు.
నిర్మల్ జిల్లాలో ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, సుమారు 3,42,000 మంది సంతకాలు చేసి ఉద్యమానికి మద్దతు తెలిపారని ప్రతినిధులు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ఈ వినతిపత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి, తగిన చర్యలు తీసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.. సంబంధిత అధికారులకు పంపించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకునేలా పరిశీలిస్తామని తెలిపారు.
అదే విధంగా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో జరుగుతున్న గోవధను వెంటనే అడ్డుకోవాలని, గోవధకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో గోభక్తులు, హిందూ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.











