ముధోల్, 14 July
ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో పేరుకుపోయిన విద్యుత్ సమస్యలను, ముఖ్యంగా ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ రావుల లావణ్య - శ్రీనివాస్ విద్యుత్ సిబ్బందికి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. గత ఫిబ్రవరి నెలలో జరిగిన గ్రామసభలో, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, కంచెలు లేకపోవడం వల్ల మూగజీవాలకు, ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు.

గత గ్రామసభలో విద్యుత్ శాఖ ఏఈ శ్రీకాంత్ కు గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై విన్నవించారు. గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామసభలో తీర్మానం చేశారు. గ్రామసభ తీర్మానం చేసి ఐదు నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, సర్పంచ్ మంగళవారం మండల కేంద్రంలోని విద్యుత్ అధికారులకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు.