హైదరాబాద్, జులై 14
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి వరంగల్, మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు.
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలను వేగవంతం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి వరంగల్, మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 2008 జూన్ 2 నాటికి మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. మరో 2, 3 వారాల్లో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2వ తేదీ నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని మంత్రి తెలిపారు.












