నిర్మల్, 30 July
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు 11 వరద గేట్లను తెరిచి, నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
నిర్మల్ జిల్లా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కడెం ప్రాజెక్టులోకి వరద నీరు గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 94,137 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 90,295 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టుకు సంబంధించిన 11 వరద గేట్లను అధికారులు తెరిచి, నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.












