Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొన్కల్ వద్ద ఉన్న సదర్మాట్ బ్యారేజ్‌లోకి వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్‌లో నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం 9, 10 నంబర్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు.
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని పొన్కల్ వద్ద ఉన్న సదర్మాట్ బ్యారేజ్‌లోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో బ్యారేజ్‌లో నీటిమట్టం వేగంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు గురువారం బ్యారేజ్‌లోని 9, 10 నంబర్ గేట్లను ఎత్తివేసి దిగువకు వరద నీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారి నవీన్ తెలిపారు.
బ్యారేజ్ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.












