(బి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ మంజూరు విషయంలో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గతంలో జరిగిన వెరిఫికేషన్ లో లోపాల వల్ల అర్హులకు ఇళ్లు మంజూరు కాలేదని ఆయన తెలిపారు.
తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ మంజూరు విషయంలో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గైక్వాడ్ సాయినాథ్ మాట్లాడుతూ.. గతంలో స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో కొన్ని సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అర్హులైన పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు ఉన్న లబ్ధిదారులకు సైతం ఆన్లైన్ రికార్డుల్లో ‘ఆర్సీసీ బిల్డింగ్’ (స్లాబ్ ఇల్లు) ఉన్నట్లు తప్పుగా నమోదు కావడంతో వారి ఇళ్ల ప్రొసీడింగ్స్ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని జిల్లా పీడీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. దీనిపై పీడీ సానుకూలంగా స్పందించారని, రెండు మూడు రోజుల్లో స్పెషల్ ఆఫీసర్ తిరిగి ఝరి (బి) గ్రామానికి వచ్చి రీ-వెరిఫికేషన్ చేపడతారని చెప్పారు. ఆన్లైన్లో ఉన్న సమస్యలను సరిచేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని పీడీ హామీ ఇచ్చినట్లు గైక్వాడ్ సాయినాథ్ పేర్కొన్నారు.











