బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
నెరడిగొండ మండలంలోని సవర్గావ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం ప్రారంభించారు. నెరడిగొండ మండలంలో ఇదే తొలి మహిళా సంఘ భవనమని, గ్రామాల అభివృద్ధికి సర్పంచుల చురుకైన పాత్ర అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
నెరడిగొండ మండలంలోని సవర్గావ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవనాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నెరడిగొండ మండలంలోనే మొట్టమొదటి మహిళా సంఘ భవనం సవర్గావ్ లోనే పూర్తయిందని, రానున్న రోజుల్లో మండలంలోని అన్ని భవనాలు పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.
ఆయా గ్రామాలు పనులు చేసుకోవడంలో సవర్గావ్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, సర్పంచులు చురుక్కుగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామంలో ప్రతీ కుటుంబం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












