బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
నెరడిగొండ మండలంలోని సవర్గావ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ భవనం మండలంలోనే మొట్టమొదటి మహిళా సంఘ భవనం కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన గ్రామాల అభివృద్ధికి, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చారు.
నెరడిగొండ మండలంలోని సవర్గావ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవనాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెరడిగొండ మండలంలోనే మొట్టమొదటి మహిళా సంఘ భవనం సవర్గావ్ లోనే పూర్తయిందని, రానున్న రోజుల్లో మండలంలోని అన్ని భవనాలు పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఆయా గ్రామాలు పనులు చేసుకోవడంలో సవర్గావ్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సర్పంచులు చురుక్కుగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, గ్రామంలో ప్రతీ కుటుంబం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












