నిర్మల్, జులై 8
భైంసాలో ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
భైంసా సబ్ డివిజన్ ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం భైంసా క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి కేసును ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు.
కుటుంబ వివాదాలకు సంబంధించిన పలు ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహనతో కొన్ని కుటుంబాలు తిరిగి కలిసేలా చేయడంలో షీ టీం కీలక పాత్ర పోషించింది. నిర్మల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా భైంసాలోనే కౌన్సిలింగ్ నిర్వహించడంతో బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.












