బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
ఆదిలాబాద్లో ఈ నెల 19న జరగనున్న అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐటీయూసీ) నాలుగో జిల్లా మహాసభల కరపత్రాన్ని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. గోవర్ధన్ గురువారం విడుదల చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతనాల అమలు, సామాజిక భద్రత వంటి అంశాలపై ఈ మహాసభల్లో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.
ఈ నెల 19న ఆదిలాబాద్లో నిర్వహించనున్న అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐటీయూసీ) నాలుగో జిల్లా మహాసభల ప్రచారంలో భాగంగా మహాసభల కరపత్రాన్ని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. గోవర్ధన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రత కల్పన, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరంతరం ఉద్యమిస్తోందని అన్నారు.
సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మహాసభలో సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.












