బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
భూముల సర్వే, రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం భైంసా మండలం బాబుల్ గావ్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు.
భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం భైంసా మండలం బాబుల్ గావ్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యాపులు లేని గ్రామాలకు మ్యాపులు తయారు చేసేందుకు చేపట్టిన సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. రీ సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగించి రీ సర్వే ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను మొత్తాన్ని గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
స్థానిక రైతులతో మాట్లాడుతూ, రైతులందరూ ఆయిల్ ఫామ్ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వస్తాయని అన్నారు. వాతావరణ పరిస్థితులు, నీటిలభ్యత, వర్షాలను బట్టి పంటలు సాగు చేయాలన్నారు. పంట మార్పిడి విధానాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏడి ల్యాండ్ సర్వే ల్యాండ్ రికార్డ్ నరసింహ మూర్తి, తహసిల్దార్ శశి భూషణ్, గ్రామ సర్పంచ్ అనసూయ మహేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












