బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
ఆదిలాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో బద్దం రాంచందర్ రెడ్డి అధ్యక్షుడిగా, పలువురు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆదిలాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఫోరం అధ్యక్షుడిగా బద్దం రాంచందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సుద్దుల అరుణ్ రెడ్డి, జాదవ్ అజయ్, చవ్హాన్ రాహుల్, ప్రధాన కార్యదర్శిగా తలంపుల రమేష్, కోశాధికారిగా తాఖ్రా సాగర్, కార్యదర్శులుగా కొత్తపల్లి ఆదెల్లు, జైక్వాడ్ గణేష్ ఎన్నికైనట్లు ప్రకటించారు.
కార్యవర్గ సభ్యులుగా తొఖల రాజు, పుండ్రు విజయలక్ష్మి, రియాజ్, నితీష్ రెడ్డి, సాయిచరణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బోగోజి సాగర్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, గ్రామాల అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.












