తెలంగాణ, 2026-07-26
రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్డుల పంపిణీ ప్రక్రియను హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వచ్చే నెల మొదటి వారం లేదా ఆగస్టు 15న ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్ల పైగా రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ పంపిణీ కార్యక్రమం వచ్చే నెల మొదటి వారంలో లేదా ఆగస్టు 15న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ స్మార్ట్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను ముద్రించారు.












