జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జనగణన ప్రక్రియలో భాగమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామంలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, జనగణనలో ఇండ్ల గణన అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. నిర్ణీత గడువులోగా ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని వివరించారు.
నిబంధనల ప్రకారం ఇంటి నంబర్లను కేటాయించాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శులు, జిపిఓలు జనగణన అధికారుల వెంబడి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జనగణన అధికారులకు అందించిన ఎన్యుమరేషన్ కిట్లను కూడా ఆయన పరిశీలించారు.
అధికంగా ఉన్న ఎండల దృష్ట్యా, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జనగణన అధికారులు తప్పనిసరిగా తమ వెంట ఓఆర్ఎస్ పొట్లాలు ఉంచుకోవాలని తెలిపారు.
ప్రజలందరూ జనగణన ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వారికి సహకరించాలని కలెక్టర్ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












