నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల స్వీకరించారు. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పారదర్శక విధానంలో తక్షణ న్యాయం అందించడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఎస్పీ తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, చట్టపరమైన సహాయాన్ని అందించి, సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి వినతులను, ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ సూచించారు. తద్వారా పోలీస్ శాఖపై ప్రజలకు భరోసా, నమ్మకం కలుగుతుందని అన్నారు.
గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదు చేసి, వాటి పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని తెలిపారు.
గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి, ఫాలో-అప్ చర్యలు తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా పర్యవేక్షణ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో చర్యలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.












