మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న జి. శ్రీనివాస్‌ను సైబరాబాద్‌కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎన్. శ్రీజరెడ్డిని నూతన కమిషనర్‌గా నియమించింది.
రాష్ట్రవ్యాప్తంగా 89 మంది మున్సిపల్ కమిషనర్ల సాధారణ బదిలీల్లో భాగంగా ఈ నియామకాలు జరిగాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ ఉత్తర్వులను శనివారం విడుదల చేసింది.
గత 11 నెలలుగా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన జి. శ్రీనివాస్, పట్టణ అభివృద్ధికి, శాశ్వత ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం. ఆయన 2025 జూన్ లో బాధ్యతలు స్వీకరించారు.
11 నెలల వ్యవధిలోనే కమిషనర్ బదిలీ కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్. శ్రీజరెడ్డి, మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి చేపట్టనున్న చర్యలపై అంచనాలు నెలకొన్నాయి.








