తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఐజేయు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నకిరేకల్ లో జూన్ 3న నిర్వహించనున్న జిల్లా మహాసభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమెల నాగయ్య పిలుపునిచ్చారు.
శనివారం మిర్యాలగూడలో జరిగిన టీయూడబ్ల్యూజే సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఈ మహాసభకు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ. ప్రభాకర్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు టీయూడబ్ల్యూజే కట్టుబడి ఉందని, వారికి ఇంటి స్థలాలు, నిర్మాణ సహాయం, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందించడానికి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మాజీ కార్యదర్శి ఎండి. అస్లాం, సీనియర్ నాయకులు పుప్పాల యాదగిరి, రంగా శ్రీనివాస్, నాగ చారి, బాలాజీ రావు, శ్రీనివాస్ బండ వేణుగోపాల్ రెడ్డి, రామకృష్ణ, అశోక్, వెంకన్న, రాచకొండ రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభ జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.










