ఆదివారం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో ఎస్సై శ్రీకాంత్ సమావేశమయ్యారు. రాబోయే ఉత్సవాలను ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని కోరారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. -ఎస్సై శ్రీకాంత్. సారంగాపూర్ నిర్మల్ జిల్లా,సారంగాపూర్:గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై శ్రీకాంత్ అన్నారు. మండలంలోని చించోలి (బి) గ్రామంలో గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.. రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలు, పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలనిఅన్నారు. ప్రజలు, నిర్వాహకులు పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలని పలు సూచనలను సూచించారు.అలాగే ప్రతి గణేష్ మండపాల వద్ద కచ్చితంగా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకొవాలని కోరగా యువత కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ,యువకులు పాల్గొన్నారు..












