టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ వ్యూయర్షిప్ పరంగా చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను భారత్‌లో దాదాపు 50 కోట్ల (500 మిలియన్లు) మంది వీక్షించినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ జై షా ప్రకటించారు. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ అని ఆయన తెలిపారు.
ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్‌గా నిలవాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించినట్లు జై షా పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశంలో వీక్షకుల సంఖ్య 50 కోట్లు దాటడం ఒక విశేషం. జియో సినిమా వీక్షకుల సంఖ్య 6.05 కోట్లకు (60.5 మిలియన్లు) చేరిందని ఆయన తెలిపారు.
ఈరోజు నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో, భారత అభిమానులు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలని ఐసీసీ ఛైర్మన్ జై షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈరోజు నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. సాయంత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు (మార్చి 5) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లలో గెలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 8 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తుది పోరు జరగనుంది.


