ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ తో సత్తా చాటిన అన్నభీమోజు రామ్
మిర్యాలగూడ ఆగస్టు 3 (మనోరంజని తెలుగు టైమ్స్)
హైదరాబాదులో జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెకండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన లోటస్ హై స్కూల్ 10 వ తరగతి విద్యార్థి అన్న భీమోజు రామ్
అండర్ -14 "కటా" విభాగంలో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించాడని చోటు ఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా మాస్టర్ బాండవత్ రామకృష్ణ తెలిపారు. సిల్వర్ మెడల్ సాధించిన రామ్ కు లోటస్ విద్యాసంస్థల చైర్మన్ వరప్రసాద్, కోచ్ రామకృష్ణ, అభినందించిశుభాకాంక్షలు తెలియజేశారు.












