East Godavari/Rajamahendravaram Rural (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
నిర్మల్పట్టణలోనిబేస్తవరిపేటవసవిన్యపరమేశ్వరిఆలయప్రణలోొనసుతున్నఓటరునమోదుప్ర్రియనుతెలణరష్ట్రఉర్దూఅడమీచైర్మన్తహెర్బిన్హధనినిర్మల్నియోజవర్్రెస్పర్టీఇచర్జ్ూచడిశ్రీహరిరవుపరిశీలిచరు.అర్హులైనప్రతిఒ్రిపేరుఓటరుజబితలోనమోదుఅయ్యేలచర్యలుతీసుోవలనివరుసూచిచరు.
ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాని, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచడి శ్రీహరి రావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి నిర్మల్ పట్టణంలోని బేస్తవారిపేట వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా BLOలు, కాంగ్రెస్ పార్టీ BLAలతో మాట్లాడి ఓటరు నమోదు, సవరణ, మార్పులు, తొలగింపుల ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, వార్డ్ కౌన్సిలర్ లక్కాకుల హరీష్, పెండెం శ్రీనివాస్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్, జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎం.డి. జీషాన్ అలీ, లక్కాకుల నరసయ్య, తోట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.












