Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలో శనివారం జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో మామడ సహకార సంఘం అధ్యక్షుడు చిక్యాల హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక ఓటరు నమోదు దరఖాస్తులను నింపి అధికారులకు అందజేశారు.
నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా మామడ సహకార సంఘం అధ్యక్షుడు చిక్యాల హరీష్ రావు శనివారం ప్రత్యేక ఓటరు నమోదు దరఖాస్తులను నింపి సంబంధిత ఓటరు నమోదు అధికారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఓటరు తన వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి అర్హుడూ ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.












