తెలంగాణ, 3 September
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఐదేళ్ల కాలానికి గాను 1825 రోజుల్లో వెయ్యి రోజులు పూర్తయినా, ఇంకా 825 రోజులు మిగిలి ఉన్నాయని అధికార పార్టీ నేతలు తమను తాము సంతృప్తి పరుచుకునే ప్రయత్నం చేసినా, ప్రజలిచ్చిన గడువులో సింహభాగం పూర్తయిందని చెప్పడం వాస్తవం కాదు. ఈ వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వ పనితీరు, విధానాలు, చేపడుతున్న చర్యలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలను బేరీజు వేసుకుంటే కొంత తీపి, మరికొంత చేదు అనుభవాలను మిగిల్చిందని వ్యాఖ్యానించాల్సి వస్తోంది.
“వెయ్యి రోజుల” పై అవలోకనం __ నవతెలంగాణ సంపాదకీయ సి ఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయింది. ఐదేండ్ల కాలానికి మొత్తం 1825 రోజుల్లో వెయ్యి రోజులు పూర్తయినా, ఇంకా 825 రోజులు మిగిలే ఉన్నాయి కదా? అని అధికార పార్టీ నేతలు తమను తాము సంతృప్తి పరుచుకునే ప్రయత్నం చేసినా, ప్రజలిచ్చిన గడువులో సింహభాగం పూర్తయిందని చెప్పడం తప్పు. ఈ వెయ్యి రోజులపాలనలో ప్రభుత్వ పనితీరు, విధానాలు, చేపడుతున్న చర్యలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితరాంశాలను బేరీజు వేసుకుంటే... కొంత తీపి, కొంత చేదు (కట్టా.. మీటా...) అని వ్యాఖ్యానించాల్సి వస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో కేవలం సింగల్ పవర్ సెంటర్‌గా కథ నడిస్తే... ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కొంత వెసులు బాటుతో మల్టీ పవర్ ఇక తమ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందంటూ చెప్పుకుంటున్న వారు... ఎందుకో తెలియదుగానీ, ఈ మధ్యకాలంలో దానికి కొంత భిన్నంగా వ్యవహరించటం శోచనీయం. విద్యార్ధి, ప్రజా, కార్మిక సంఘాల ఆందోళనలను అడ్డుకోవటం, ఆరెస్టులు చేయటం ప్రజా పాలన అనిపించుకోదు గదా? దీంతోపాటు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, అతి పెద్ద పార్టీగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్.. రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్నప్పుడు, దాని స్థాయి, బలానికి తగ్గట్టే కేంద్రంపై పోరాడాలి. నిధుల కోసం కొట్లాడాలి. తెలంగాణ హక్కుల కోసం మోడీ సర్కారును నిలేయాలి. కానీ అవి మచ్చుకైనా కానరాకపోవటం అత్యంత విస్మయకరం. సెంటర్‌గా పరిస్థితి కొన సాగుతోంది. అప్పట్లో 'ఆ ముగ్గురు' చెప్పించే వేదమైతే.. ఇప్పుడు దానికి భిన్నంగా మంత్రులు ఎవరిడి వారే నిర్ణయాలు తీసుకోవటం కనబడుతోంది. ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ అమాత్యులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న తీరును మనం గమనించొచ్చు, మరోవైపు భారత్ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, హిల్ట్ పాలసీ, ఫార్మాసిటీ, మూసీ ప్రక్షాళన తదితర దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుని ముందుకుపోతున్న రేవంత్ సర్కార్... ఆరు గ్యారెంటీల అమలుకు మాత్రం కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. తమది ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాధినేతలు వెయ్యి రోజుల పాలన తర్వాత ఆత్మ విమర్శ, ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంది. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు తదితరులు సలహాదారులుగా నియమించుకున్న నేపథ్యంలో వారు తమ రాజకీయ ప్రయోజనాల కోణంలోంచే సబహా లిస్తారు తప్పితే ప్రజా ప్రజా ప్రయోజనం ఉండదన్న వాస్తవాన్ని అధినేతలు గ్రహించాలి. దీంతోపాటు ఐఏఎస్‌లు, ఐపీఎస్లలు ఒక పోస్టులో పూర్తిగా కుదురుకోకముందే వారిని పదే పదే ఒకశాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేయటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇది అవగాహనా లేమిడి, పాలనపై పరిపక్వత లేమిని సూచిస్తోంది. దీంతో శాఖలు అభివృద్ది, సంక్షేమ కార్యక్ర మాలు కూడా కుంటుపడుతున్న దుస్ధితి. గత బీఆర్ఎస్ హయాంలో అవినీతిపరు లు, అక్రమాలకు పాల్పడుతు న్నారంటూ పలువురు ఐఏఎస్ఐపై దుమ్మెత్తిపోసిన సంగతి మనకెరుకే, కానీ, ఇప్పుడు అదే ఉన్న తాధికారులే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం. ఇది పరస్పర విరుద్ధమైన వైఖరికి నిదర్శనం. కాగా గత ప్రభుత్వ అప్పులు, వాటి వడ్డీలు, తలెత్తిన తిప్పల నుంచి సర్కారు అనేక ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిం చటం ముదావహం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500 కి గ్యాస్ సిలిండర్... వీటి అమల్లో కొన్ని లోపాలు, లొసుగులున్నా వాటి అమలు పట్ల హర్షం వ్యక్తం చేయాల్సిందే. లోపాలను సవరించాలి, అందరికీ వాటిని అమలు చేయాలని డిమాండ్ చేయాల్సిందే. అదే సమయంలో అట్టడుగునున్న పేదలు, మహిళలను అదుకోపటంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం నెలకు రూ.2,500 సాయం, ఆటోవాలాల ఉపాధి రక్షణ కోసం నెలకు రూ. వెయ్యి ధృతి, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు, తోలు రైతులకు సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామంటూ హస్తం పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఆర్భాట మైన ఈ ప్రకటనలన్నీ ఎప్పుడో ఆటచెక్కాయి. దీంతో ఆయా తరగతుల నుంచి ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుం టోందనే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. వీటితోపాటు రైతు భరోసా డబ్బులు సకాలంలో వేయకపోవటంతో ఇక్కట్లపాలవు తున్నారు. ఆసరా, చేయూత పింఛన్ల పెంపుకో లబ్దిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీటి సంగ నిలదీయకముందే సర్కారు మేల్కొనాలి. ఇక తమ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రజాస్వామ్మ ఎక్కువగా ఉంటుందంటూ చెప్పుకుంటున్న వారు... ఎందు తెలియదుగానీ, ఈ మధ్యకాలంలో దానికి కొంత భిన్నంగా వ్యవహరించటం శోచనీయం. విద్యార్థి, ప్రజా, కార్మిక సంఘాల ఆందోళనలను అడ్డుకోవటం, అరెస్టులు చేయటం ప్రజా పాలన అనిపించుకోదు గదా? దీంతోపాటు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, అతి పెద్ద పార్టీగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్.. రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్నప్పుడు, దాని స్థాయి, బలానికి తగ్గట్టే కేంద్రంపై పోరాడాలి. నిధుల కోసం కొట్లాడాలి. తెలంగాణ హక్కుల కోసం మోడీ సర్కారును నిలేయాలి. కానీ, అవి మచ్చుకైనా కానరాకపోవటం అత్యంత విస్మయకరం, సాక్షాత్తూ సీఎం వద్దే హోం, విద్య, మున్సిపల్ లాంటి కీలక శాఖలున్నా వాటిపై పర్యవేక్షలు, సమీక్షలు అంతంతమాత్రం గానే ఉండటం గమనార్హం. ఇటీవల ఆదివాసీ యువతి శిరీషపై అఘాయిత్యం జరిగినా, ముఖ్యమంత్రి స్పందించకపోవటం అత్యంత విచారకరం. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న క్రమంలో ఇలాంటి బలహీనతలు, లోపాలను సరిచేసుకుని, ముందుకు సాగుతుందని, ప్రజారంజకమైన పరిపాలనను అందిస్తుందని ఆశిద్దాం. లేదంటే ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ... అనే సామెతను గుర్తుచేసుకోవాల్సి వస్తుంది.












