తలమడుగు, ఆగస్టు 4
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు హాజరై, మండల కమిటీల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన 'సంఘటన్ సృజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డితో కలిసి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కమిటీల ఏర్పాటు, పార్టీ సంస్థాగత బలోపేతం, గ్రామ, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ఆడే గజేందర్ మాట్లాడుతూ, నూతన మండల కమిటీల నియామకంలో వర్గ విభేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పారదర్శకంగా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో కలిపి మొత్తం 21 మంది సభ్యులు ఉండేలా, అందులో ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో కమిటీని రూపొందించాలని తెలిపారు. మహిళా నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.
అలాగే సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల అనుభవాన్ని వినియోగించుకునేందుకు ప్రతి మండలంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు చేయాలని, జిల్లా వ్యాప్తంగా మండల కమిటీల ఏర్పాటును ఆగస్టు 15లోగా పూర్తి చేసి, గ్రామ, బూత్ స్థాయి కమిటీలను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తప్పకుండా గుర్తించి తగిన గౌరవం కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ప్రతాప్ అధ్యక్షత వహించగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్యాణం రాజేశ్వర్, ఇచ్చోడ బ్లాక్ ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏలేటి అశ్విన్ రెడ్డి, జిల్లా ఓబీసీ విభాగం చైర్మన్ అంబకంటి అశోక్, డీసీసీ ఉపాధ్యక్షులు బొల్లరపు బాబన్న, సుధాకర్ గౌడ్, మాజీ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతరెడ్డి, ఉపాధ్యక్షుడు గుడాల అనీష్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి కిరణ్, ఉండం గ్రామ సర్పంచ్ మహేందర్, ఉపసర్పంచ్ రఫీక్, మాజీ ఎంపీటీసీ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











