ముథోల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
ముథోల్ మండలంలోని రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ముథోల్ మండలంలోని రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నక్క మల్లేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మృతి వార్తతో రువ్వి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామస్థులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మల్లేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.











