కరీంనగర్, 2024-06-27
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బహుజనుల గొంతుక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కొంకటి శేఖర్ ఆరోపించారు. కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బహుజనుల గొంతుక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కొంకటి శేఖర్ ఆరోపించారు.
కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కుదించడం అంటే ఒక్క వ్యక్తిపై చర్య కాదని, అణగారిన వర్గాల గొంతుకను అణిచివేసే ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు.
దేశ భద్రత కోసం 26 సంవత్సరాలు పోలీసు అధికారిగా సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు రాష్ట్రపతి పోలీసు పతకం వంటి గౌరవాలు లభించాయని గుర్తు చేశారు.
ప్రభుత్వంలోని లోపాలు, అవినీతిపై ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటవీ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తుంటారని, అలాంటి వ్యక్తికి భద్రత తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడికి అండగా నిలుస్తామని తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాస్తవాలు మాట్లాడి న్యాయం చేయాలని కోరినప్పటి నుంచి ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నేరుగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువ నాయకులు గుడిసె విష్ణు, చుక్క శ్రీనివాస్, కళ్లేపల్లి తిరుపతి, కళ్లేపల్లి అరవింద్, బొంకూరి మోహన్, చిట్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.











