ముధోల్, 21 July
నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలకు ఇది విరుద్ధమని ఆయన అన్నారు.
నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తీవ్రంగా ఖండించారు.
మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. ప్రజల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై ఇలా అమానుషంగా వ్యవహరించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
దేశ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదని, న్యాయం పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ఆయన అన్నారు. లేనియెడల గల్లీ నుండి ఢిల్లీ దాకా తాము సైతం విద్యార్థులకు అండగా నిలిచి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, సయ్యద్ ఖలీద్, శ్రీనివాస్ గౌడ్, సంజు తదితరులు పాల్గొన్నారు.












