భద్రాచలం, జూలై 22
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడి, అనంతరం అరెస్టు చేయడాన్ని భద్రాచలం సేవాదళ్ 'ఏ' బ్లాక్ అధ్యక్షుడు గర్నేపల్లి అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడి, అనంతరం అరెస్టు చేయడాన్ని భద్రాచలం సేవాదళ్ 'ఏ' బ్లాక్ అధ్యక్షుడు గర్నేపల్లి అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ప్రజల తరఫున పోరాడడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. అలాంటి నాయకులపై దాడులు చేసి అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన వైఖరిని అవలంబిస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా పాలన సాగించాలని సూచించారు.
రాహుల్ గాంధీపై నమోదైన కేసులు, అరెస్టు వంటి చర్యలను పునఃసమీక్షించి న్యాయబద్ధంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గర్నేపల్లి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.











