కరీంనగర్, బుధవారం, జులై 22
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా, నీట్ పరీక్ష లీకేజీలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ నిరసనలో పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా, నీట్ పరీక్ష లీకేజీలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, నీట్ పరీక్ష లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీలో నిరసన తెలిపేవారిపై అమానుషంగా దాడులు చేసి, భాష్పవాయువులు ప్రయోగించి అణచివేయాలని చూశారని ఆరోపించారు. తక్షణమే పరీక్షల లీకేజీ ఘటనకు బాధ్యత వహించి ప్రధాని మోడీ తప్పుకోవాలని, లేనియెడల దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.












