Nirmal/Kadam (Peddur) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్ ఫోరం సోషల్ మీడియా ఇంచార్జిగా సాయినాథ్‌ను నియమించారు. ఈ నియామకంపై జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సంపత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సాయినాథ్ తన కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్ ఫోరం సోషల్ మీడియా ఇంచార్జిగా సాయినాథ్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సంపత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్, జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సంపత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తనవంతు సహకారం అందిస్తానని, సోషల్ మీడియా ద్వారా చురుకుగా ఉంటూ ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.












