Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
నిర్మల్ రూరల్ మండలంలో బూత్ లెవల్ సూపర్వైజర్లు (బీఎల్ఎస్), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ)తో నిర్వహించిన సమన్వయ సమావేశంలో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 3లోపు అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు, సవరణలు, ఆన్లైన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
నిర్మల్ రూరల్ మండలంలో బీఎల్ఎస్, బీఎల్ఏల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ, ఆగస్టు 3వ తేదీలోపు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు, అవసరమైన సవరణలు, ఆన్లైన్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేసేలా బూత్ లెవల్ సూపర్వైజర్లు (బీఎల్ఎస్), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి బూత్‌లో సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రతి బీఎల్ఎస్, బీఎల్ఏ తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగలకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో నిర్మల్ రూరల్ మండలానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి గాజుల రవికుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొట్టే శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, మాజీ మండల అధ్యక్షులు వేణుగోపాల్, ఏ. భీంరెడ్డి, వెంగ్వాపేట్ సర్పంచ్ విజయ్, విలాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.












