నిర్మల్, జూన్ 27
నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ బి. ఎల్ ఏ లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.
ఈ సదస్సు ద్వారా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, సవరణలపై పార్టీ శ్రేణులకు స్పష్టత కల్పించడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.











