ముధోల్, జూలై 20
ముధోల్ మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని సోమవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించారు. నూతన కార్యవర్గం ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపింది.
ముధోల్ మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని సోమవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫోరం గౌరవాధ్యక్షుడిగా ఏడ్బిడ్ తండా ఉపసర్పంచ్ జాదవ్ అంబర్‌సింగ్, అధ్యక్షుడిగా కారేగాం గ్రామానికి చెందిన నర్సారెడ్డి, ఉపాధ్యక్షుడిగా చించాలకు చెందిన పీసర సాయినాథ్ గౌడ్, కార్యదర్శులుగా తరోడాకు చెందిన కే. రజిత హనుమంతరావు, భోరిగాంకు చెందిన కే. సవిత, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏడ్బిడ్కు చెందిన ఎం. భూమన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
సలహాదారులుగా బ్రహ్మంగావ్కు చెందిన రాజుల రఘునాథ్, ముద్గల్‌కు చెందిన జే. గోపాల్, ఆష్ట గ్రామానికి చెందిన సావిత్రి భోజన్న, విట్టోలి తండాకు చెందిన గజానంద్ రాథోడ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. జిల్లా సంఘం నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపసర్పంచులు పాల్గొన్నారు.










