హృదయాల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
మిర్యాలగూడ పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సేవలను ఆయన స్మరించుకున్నారు.
వై.ఎస్. ఆర్ సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
మిర్యాలగూడ సెప్టెంబర్ 2 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. వై.యస్.ఆర్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డాక్టర్ జాడీ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, పాల్గొన్నారు.












