రాజమండ్రి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 03
దేశంలో యువత భవిష్యత్ పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, పాలకుల పాపాలు యువత భవిష్యత్ కు శాపంగా మారుతున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీపై జరిగిన నిరసనలకు బాధ్యులెవరో తేల్చాలని, విద్యార్థులపై మోపుతున్న పోలీసు కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలో యువత భవిష్యత్ ను నిర్వీర్యం చేయడానికి కార్పొరేట్ శక్తులు కుట్ర పన్నుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
దేశంలో యువత భవిష్యత్ పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, పాలకుల పాపాలు యువత భవిష్యత్ కు శాపంగా మారుతున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీపై జరిగిన నిరసనలకు బాధ్యులెవరో తేల్చాలని, విద్యార్థులపై మోపుతున్న పోలీసు కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో యువత భవిష్యత్ ను నిర్వీర్యం చేయడానికి ప్రపంచ అగ్ర దేశాలకు చెందిన కార్పొరేట్ శక్తులు కుట్ర పన్నుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి మార్గాలను కొన్ని అగ్రదేశాలకు మన పాలకులు అంకితం చేస్తున్నారని, ఎంత చదువుకున్నా యువత కూలి పనులకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం అడిగితే అక్రమ కేసులకు బలికావాల్సి వస్తోందని, పాలనలో సంస్కరణలు జరగకపోతే యువత భవిష్యత్ మొత్తం మానసిక విఖలాంగుల వలే మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దేశ సంపద కొంతమంది సంపన్న వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోతోందని, ఒకప్పుడు విదేశీ దోపిడి దారులు దోచుకుంటే, నేడు స్వదేశీ పాలకులు దోచుకుంటున్నారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 83 ఏళ్లు గడుస్తున్నా, నాటి డచ్చి, ఫ్రెంచ్, మొఘల్, సుల్తాన్, ఆంగ్లేయుల పాలనను మించిన రాక్షస పాలనే నేటికీ సాగుతోందని, పేరుకు ప్రజాస్వామ్యం అయినప్పటికీ తూటా, లాఠీనే శాసిస్తున్నాయని అన్నారు. నేటి ప్రజా ఉద్యమాల్లో దళారులు, రాజకీయ కోవర్టులు, సంఘ విద్రోహులు చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారని, పాలకుల ద్రోహాలు, పాపాలు యువత భవిష్యత్ కు శాపంగా మారుతున్నాయని తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు.
నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల ఉద్యమానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని, అసలు నేరస్తులెవరో, ప్రభుత్వం ఆరోపిస్తున్న సంఘ విద్రోహులెవరో నిజాయితీగా తేల్చాలని కోరారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులలో 85 మంది ఆవేదన, ఆక్రందనతో ఉన్నారని గ్రహించాలని సూచించారు. నీట్ లీకేజీ వ్యవహారాన్ని వాస్తవమని గ్రహించి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం శుభ పరిణామం అయినప్పటికీ, నష్టపోయిన విద్యార్థుల భవిష్యత్ కు న్యాయం జరగలేదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేసిన నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి న్యాయం చేయాలని ఆర్జిస్తున్నారని, వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించడం బాధాకరమని అన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయకపోతే ధర్మేంద్ర ప్రధాన్ మరింత కాలం ఆ పదవిలో కొనసాగి, మరెంతో మంది యువత భవిష్యత్ నాశనానికి బాధ్యులయ్యేవారని పేర్కొన్నారు.












