గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి, చొప్పదండి మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ సుంకే రవిశంకర్ అన్నగారి పిలుపు మేరకు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్‌ను సందర్శించడం జరిగింది.
ప్రాజెక్టు ప్రాముఖ్యత
పుస్తకాల్లో చదివి, వార్తల్లో విన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగాన్ని ప్రత్యక్షంగా చూడటం ఇదే ప్రథమం. ఒకప్పుడు నీటి కోసం ఎదురుచూసిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో అధినేత కేసీఆర్ మానస పుత్రిక ఈ ప్రాజెక్టు, నేడు లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీటిని అందిస్తూ తెలంగాణ అభివృద్ధికి చిరునామాగా నిలిచింది.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్టు కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, రైతు జీవితాల్లో వెలుగులు నింపిన అద్భుతం, తెలంగాణ అభివృద్ధి, రైతు సంక్షేమం, భవిష్యత్ తరాల కోసం నిర్మించిన కట్టడం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించే ఆస్తి.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉప్పరమల్యాల గ్రామం బీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.











