న్యూఢిల్లీ, 2026-08-02
దేశంలో పేపర్ లీకేజిలపై పోరాడుతున్న సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కక్షసాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్‌రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన జీతం రూ.65,000 లోపు ఉన్నప్పుడు అమెరికాలో కుమారుడిని ఎలా చదివించగలిగారో విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సూరత్‌కు చెందిన ఆర్టిఐ కార్యకర్త అమిత్ తివారీ తెలిపారు.

ఆదాయానికి మించిన ఆస్తులపై ఫిర్యాదు
ఒకవేళ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారమైతే కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం అని అమిత్ తివారీ చెప్పారు.
న్యాయ సహాయ నిధి
ఇదిలా ఉండగా, పోలీసు కేసులను ఎదుర్కొంటున్న సిజెపి నిరసనకారులకు న్యాయ సహాయం చేసేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన న్యాయపరమైన రక్షణ నిధి (లీగల్ డిఫెన్స్ ఫండ్) విషయంలో భారత ఎన్నికల సంఘం, సెంట్రల్ జిఎస్టికి లేఖ రాసినట్లు కూడా ఆయన తెలిపారు.