హైదరాబాద్, జులై 27
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సోమవారం లోక్సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. చట్ట సవరణ బిల్లు-2026, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య బిల్లుతో పాటు, ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన శిక్షలు విధించే ప్రతిపాదనతో కూడిన బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది. గత ఐదు రోజులుగా సభలు వాయిదా పడుతున్న నేపథ్యంలో, నేటి సమావేశాలు కూడా ప్రతిపక్షాల ఆందోళనలతో వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభలో రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. చట్ట సవరణ బిల్లు-2026 తో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య బిల్లు, అదేవిధంగా ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడితే కఠిన శిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం సోమవారం లోకసభలో చట్ట సవరణ బిల్లు తీసుకురానుంది.
గత ఐదు రోజులుగా ఉభయ సభలు వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో, నేటి సమావేశాలు కూడా ప్రతిపక్షాల ఆందోళనలతో వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి శాసన కార్యక్రమాలు సజావుగా సాగలేదు.
మరోవైపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. విద్యార్థులపై పోలీసుల దాడులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పేలా పార్లమెంటు వేదికగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.
ఈ ఘటనపై చర్చకు అనుమతివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్ నోటీసు ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












