సారంగాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మండల బూత్ లెవెల్ ఇంచార్జీ పొద్దుటూరు సతీష్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తల కృషి అత్యవసరమని ఆయన అన్నారు.
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం అని, వారి కృషి వల్లే పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేయాలని ఆయన కోరారు.
త్వరలోనే ప్రతి బూత్‌కు ఏజెంట్లను నియమించనున్నట్లు, పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహరచన చేయనున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు. మండలంలో ఆయనకు ఇది మొదటి పర్యటన కావడంతో, పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు.
ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్, నిర్మల్ జిల్లా ఆర్టీఏ సభ్యులు తుమ్మల మల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, ఆడెల్లి పోచమ్మ చైర్మన్ సింగం భోజగౌడ్, మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది, కిషన్ సెల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతారెడ్డి, డీసీసీ సభ్యులు రాజ్ మహమ్మద్, గ్రామ సర్పంచులు కునేరు భూమన్న, దండు సాయన్న, నాయకులు సామల వీరయ్య, నారాయణ రెడ్డి, భూమారెడ్డి, జగదీష్, జ్ఞానేశ్వర్, నవీన్, రమేష్, సురేందర్, కుర్మ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.












