కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేయబడిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, భవిష్యత్తుపై భరోసాను అందిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ రావుల గంగారెడ్డి అన్నారు. శనివారం ఎడ్ బిడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి హాజరైన ఆయన, లబ్ధిదారులను సన్మానించారు.
మండల కాంగ్రెస్ ఇంచార్జ్ రావుల గంగారెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ద్వారా నిరుపేదలకు దశాబ్దాల పాటు నిశ్చింతగా ఉండేలా గూడు లభించిందని, ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. పేదల కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు.
ఇచ్చిన హామీ ప్రకారం, ఎలాంటి ఆలస్యం లేకుండా బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయించి, గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించామని రావుల గంగారెడ్డి పేర్కొన్నారు. ప్రతి పేదవాని కల నెరవేరేలా ప్రభుత్వం దిశా నిర్దేశంతో ముందుకెళ్తోందని ఆయన తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగుతోందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రావుల గంగారెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నారాయణ రావు పటేల్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.











