హైదరాబాద్, జూలై 18
సరూర్నగర్లో నిరుద్యోగ యువత, విద్యార్థులతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల అంశాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
సరూర్నగర్లో నిరుద్యోగ యువత, విద్యార్థులతో నిర్వహించిన భారీ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు శాంబిపూర్ రాజు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, టీపీఎస్సీ మాజీ సభ్యుడు సుమిత్రానంద్, మాజీ ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పోతంగల్ కిషన్ రావు, వాసుదేవ్ రెడ్డి, గజ్జెల నాగేష్, గాంధీతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల అంశాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.












