బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
బోథ్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ దరఖాస్తులను స్వీకరించేందుకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌కు ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తున్నారు.
బోథ్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ దరఖాస్తులను స్వీకరించేందుకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌కు ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్ ఆధ్వర్యంలో ఈ హెల్ప్‌డెస్క్ కొనసాగుతోంది.
ఈ హెల్ప్‌డెస్క్‌లో బోథ్ పట్టణానికి చెందిన 10 మంది బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకురాలు సుమలత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరావు, కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులు, వారి పర్యవేక్షకులు, గ్రామపంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండి ఓటర్లకు దరఖాస్తులు నింపడంలో సహాయపడుతూ వాటిని స్వీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా బోథ్ మండల కన్వీనర్ మేరుగు భోజన్న, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్, బూత్ స్థాయి ప్రతినిధులు షేక్ అబూద్, కౌసర్, ఎండీ అబ్రర్, కాంగ్రెస్ నాయకులు, మాజీ బోథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేరుగు నర్సింహాదాస్, షేక్, అచ్యుత్, సన్నీ రెడ్డి, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లకు ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, దరఖాస్తులను సక్రమంగా నింపి గడువులోగా సమర్పించాలని అవగాహన కల్పించారు.










