బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ బోథ్ మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించింది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలకు బాకీ కార్డులు అందజేశారు.
*కాంగ్రెస్ హామీల బాకీ కార్డులతో బి ఆర్ ఎస్ సమరభేరి*
బొథ్, సెప్టెంబర్ 2 మనోరంజని తెలుగు టైమ్స్ : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన 7 రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా బోథ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.ఈ సందర్భంగా ప్రజలకు “బాకీ కార్డులు” అందజేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను, వాటి అమలులో వైఫల్యాలను ఎత్తిచూపారు. అనంతరం 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బాకీ కార్డుతో సెల్ఫీ దిగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.“ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టడమే బీఆర్ఎస్ పోరాటం” అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా, బోథ్ నియోజకవర్గ ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం మరింత ఉధృతం చేస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












